Python tutorial in different Indian languages
This project is maintained by nutanc
ప్రొగ్రామింగ్ పుస్తకాలు సాధారణంగా ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. దీంతో ఇంగ్లీష్ వచ్చిన వారే ప్రోగ్రామింగ్ నేర్చుకోగలుగుతున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ ప్రోగ్రామింగ్ బోధనా పద్ధతులను తీసుకురావాలన్నదే మా ప్రయత్నం. తద్వారా పిల్లలు తమ మాతృ భాషలోనే ప్రోగ్రామింగ్ నేర్చుకోగలుగుతారు. మన మాత్రు బాశలొ ప్రొగ్రమ్ చెయ్యెడం, ఆలొచించడం వల్ల మనం ఇంకా మెరుగ్గా పని చేయ గలం.
ప్రోగ్రామింగ్ చాలా కష్టమైనదని చాలా మంది అభిప్రాయం. చాలా మందికి కంప్యూటర్లంటే భయం. కొద్ది మంది మాత్రమే ప్రోగ్రామింగ్ చేయగలరని వారి భావన. అసలు విషయం ఏమిటంటే, ఎవరైనా ప్రోగ్రామ్ చేయగలరు. మీరు ఆలోచించగలిగి, విషయాలను పంచుకోగలిగిన వారైతే చాలు, మీరు ప్రోగ్రామ్ చేయవచ్చు.
ప్రోగ్రామింగ్ అంటే ఏంటో కాదు, కంప్యూటర్‌తో మాట్లాడడమే. నేను మీతో మాట్లాడాలంటే, తెలుగులో మాట్లాడతాను. అమెరికన్‌తో మాట్లాడాలంటే ఇంగ్లీష్‌లో మాట్లాడతా. అలాగే కంప్యూటర్‌తో మాట్లాడాలంటే ప్రోగ్రామింగ్ భాష (లాంగ్వేజ్)లో మాట్లాడతా. అంతే.
మనుషులకు ఎన్నో భాషలు ఉన్నట్టుగానే, అనేక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు కూడా ఉన్నాయి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో పైథాన్ (Python) ఒకటి. ఇది చాలా సులభమైన లాంగ్వేజ్. అలాగే కంప్యూటర్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ (నిక్షిప్తం) అయి ఉంటుంది. కాబట్టి, దానిని ఉపయోగించడం కోసం మీరు అదనంగా చేయాల్సింది ఏమీ లేదు.
ఉబుంటూ లైనక్స్ (Ubuntu Linux) ఉపయోగించి నేను ఉదాహరణలు చూపిస్తాను. ఉబుంటూలో పైథాన్ ముందుగానే ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. మీ కంప్యూటర్లో విండోస్ (Windows) ఉంటే, తదుపరి అధ్యాయాలు చదవడానికి ముందు సూచనలను చూసి, పైథాన్ ఇన్‌స్టాల్ చేయాల్సిందిగా మీ తల్లిదండ్రులను కోరండి.
కంప్యూటర్ ఎంతో శక్తివంతమైన బహుళ ప్రయోజన యంత్రం. దీని ద్వారా ఎన్నో పనులను చక్కబెట్టవచ్చు. కానీ అది ఏ పనినీ సొంతంగా చేయలేదు. ఏం చేయాలన్నా మనం దానికి వివరంగా చెప్పాలి. అలా చెప్పడానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను ఉపయోగిస్తాం. కాబట్టి ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్‌కి ఇచ్చే సూచనల క్రమం అన్నమాట. మనం మన భాషలోనే ఎవరైనా ఏవైనా సూచనలిస్తే ఎలా అర్థం చేసుకుంటామో, కంప్యూటర్లు కూడా వాటికి అర్థమయ్యే భాషలో చెబితేనే మనం చెప్పిన పనిని చేస్తాయి.
ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ద్వారా ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం.
నేను మీకు 5 కార్డులు ఇచ్చాను అనుకోండి. ప్రతి కార్డుపై ఒక సంఖ్య ఉంటుంది.
అవి 5,1,3,8,4 అనుకుందాం.
ఈ 5 కార్డులలో అతిపెద్ద సంఖ్య కలిగిన కార్డును కనుగొనండి. ఏంటది?
8 అని మనందరికీ తెలుసు.
కానీ మీరు అది ఎలా కనుగొన్నారు? మీ మెదడులో మీరు చాలా వేగంగా లెక్కిస్తారు. సంఖ్యలను పోల్చి, సమాధానాన్ని చెబుతారు.
ఇదే విషయాన్ని మరొక ఆసక్తికరమైన పద్ధతిలో తెలుసుకుందాం.
నేను మీకు ఒక కీలుబొమ్మ/రోబోను ఇస్తాను (లేదా మీరు మీ స్నేహితుడితో ఈ ప్రయోగం చేయవచ్చు). అది మీరు చెప్పిన పనులను మాత్రమే చేస్తుంది. అది మీ భాషను అర్థం చేసుకుంటుంది. మీరు చేయాల్సింది ఏమిటంటే, పైన చెప్పిన కార్డులలో అతిపెద్ద సంఖ్య కలిగిన కార్డును కనుగొనడానికి దశలవారీగా(ఒకటి తరువాత ఒకటి) ఏం చేయాలో మీరు దానికి వివరంగా చెప్పాలి. చేస్తారా? కావాల్సినంత సమయం తీసుకోండి. ఆలోచించండి. నేనైతే రోబోకు ఏం చెబుతానో కింద వివరిస్తాను, కానీ అంతకుముందు మీరు ఆలోచించాలి. మీ స్నేహితుడితో ప్రయత్నించండి. వారికి సూచనలు ఇవ్వండి. సూచనలు అన్నీ ముగిశాక, మీ స్నేహితుడు చేతిలో అతిపెద్ద సంఖ్య కలిగిన కార్డు ఉంటుందా, లేదా చూడండి. .
.
.
.
.
.
.
.
.
.
సూచనలు నేను ఇవ్వాల్సి వస్తే ఇలా ఉంటాయి:
మీరు మీ మొదటి ప్రోగ్రామ్‌ని రాసేశారు. వాస్తవానికి ఈ సూచనల క్రమాన్నే అల్గారిథమ్ అంటాము.
కంప్యూటర్లకు ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి, పైన పేర్కొన్న ప్రోగ్రామ్‌ని వాటికి అర్థమయ్యే పైథాన్ వంటి లాంగ్వేజ్‌లో రాయాలి. ఇదే మీరు నేర్చుకోబోయేది.
మనం ఈరోజు పైథాన్ కోడింగ్‌ని ప్రారంభిద్దాం. మీ కంప్యూటర్లో టెర్మినల్/కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేసి (తెలియకపోతే మీ తల్లిదండ్రులను అడగండి), python3 అని టైప్ చేయండి.
>python3
మీకు కింద చూపినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు పైథాన్ ఇంటర్ప్రీటర్లో(ఆంటె పైథాన్ భాషను అర్థం చెసుకునేది) ఉన్నారనమాట.
Python 3.5.2 (default, Dec 4 2017, 14:50:18) [GCC 5.4.0 20160609] on linux2 Type “help”, “copyright”, “credits” or “license” for more information.
>>>
”»>” పక్కన కమాండ్(ఏమి చేయాలొ) లను టైప్ చేస్తూ మీరు మీ కంప్యూటర్‌తో మాట్లాడడం (కమ్యూనికేషన్) ప్రారంభించవచ్చు
ఇంతకుముందు వివరించినట్టుగా, మీరు కంప్యూటర్‌కి దాని భాషలో ఏం చేయాలో చెప్పవచ్చు. మొదటగా మనం కంప్యూటర్ని ఏదైనా ప్రింట్(ముద్రించు) చేయమని అడుగుదాం. ఎలా చేస్తాం? print() ఫంక్షన్ ఉపయోగించి మనం ఏదైనా ప్రింట్ చేయమని కంప్యూటర్‌కి చెప్పవచ్చు. print() అంటే ఏమిటి. Print () అంటే “హే కంప్యూటర్, ఓపెన్ బ్రాకెట్ మరియు క్లోజ్ బ్రాకెట్ (print తరువాతా ఉన్న చిహ్నాలు) మధ్యన ఏది ఉంచినా, దాన్ని ముద్రించు” అని మనం కంప్యూటర్‌కి చెప్పడం. ప్రతి సారి తెలుగులొ పూర్తి వాక్యంలో చెప్పడానికి బదులు, అలాగే కంప్యూటర్‌కి తెలుగు కూడా రాదు కాబట్టి, మనం పైథాన్ భాషలో print()ని ఉపయోగిస్తాము. ఒకసారి ప్రయత్నించి చూద్దామా?
>>>print(4)
అవుట్ పుట్ ఏం వస్తుంది? అది ‘4’ చూపించి ఉంటుంది. మరిన్ని ప్రయత్నించి చూద్దాం.
>>>print(987)
>>>print(54)
ఇప్పుడు వేరే ఇంకేమైనా ప్రయత్నించి చూద్దాం.
>>>print(“నమస్తె”)
నేను print తరువాత డబుల్ కోట్స్ (“) ని ఉపయోగించింది మీరు గమనించారా. పైథాన్ లాంగ్వేజ్లో ఇది మరొక నియమము. మనం 4, 987, 54 వంటి అంకెలను ఉపయోగించినప్పుడు “” ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ మనం పదాలు, అలాగే వాక్యాలను ప్రింట్ చేయాలనుకుంటే “ “ ఉపయోగించాల్సి ఉంటుంది.
“ “ ని ఉపయోగించినప్పుడు వాటిని మనం స్ట్రింగ్స్ అని అంటాం.
సరే. అదంతా బాగుంది. కానీ కంప్యూటర్ ఉపయోగకరంగా ఏమీ చేయడం లేదు. మనం ఏది ఇస్తే, దాన్నే ప్రింట్ చేస్తోంది. అందుకే ఏదైన మరింత ఉపయోగకరమైన పద్ధతిలో ప్రయత్నించి చూద్దాం ఇప్పుడు.
>>>print(4+5)
9
అద్భుతం! కంప్యూటర్ కూడిక చేసి, సమాధానాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాం.
>>>print(45675456+98373747)
144049203
బాగుంది. పైథాన్ ఇతర గణిత పరిక్రియలను కూడా చేయగలుగుతుందా? ప్రయత్నించి చూద్దాం. మీరు ఈ కింది వాటిని పైథాన్ లాంగ్వేజ్లో ఉపయోగించవచ్చు:
ఈ పరిక్రియలతో ప్రాంప్ట్‌లో(>>>) సరదాగా కంప్యూటర్‌కి కమాండ్లు ఇవ్వండి. మీకు ఇష్టమొచ్చింది టైప్ చేసి, కంప్యూటర్ ఏం అవుట్‌పుట్ ఇస్తుందో చూడండి. గణిత సమస్యలను పరిష్కరించాల్సిందిగా కంప్యూటర్‌కి చెప్పడం ఎలాగో ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. అలాగే మీ గణితం హోమ్ వర్క్ చేయడానికి కూడా పైథాన్ లాంగ్వేజ్‌ని ఉపయోగించండి :) కంప్యూటర్‌కి గణిత హోమ్ వర్క్ సమస్యను పరిష్కరించాల్సిందిగా చెప్పడమెలాగో ఇప్పుడు
సమస్య: రాజా దగ్గర 5 యాపిళ్లు ఉన్నాయి. రాణి దగ్గర 4 యాపిళ్లు ఉన్నాయి. ఇద్దరి దగ్గర కలిపి మొత్తం ఎన్ని యాపిళ్లు ఉన్నాయి.
సాధారణంగా మీరు దీన్ని ఎలా పరిష్కరిస్తారు? మీరు ఇలా కాగితంపై రాసి సమస్యను సాధిస్తారు.
రాజా దగ్గర ఉన్న యాపిళ్ల సంఖ్య = 5
రాణి దగ్గర ఉన్న యాపిళ్ల సంఖ్య = 4
మొత్తం యాపిళ్ల సంఖ్య = రాజా దగ్గర ఉన్న యాపిళ్ల సంఖ్య + రాణి దగ్గర ఉన్న యాపిళ్ల సంఖ్య =5+4=9
దీన్నే ఇప్పుడు పైథాన్‌లో ఎలా చేయవచ్చో చూద్దాం.
>>>రాజా_దగ్గర_ఉన్న_యాపిళ్ల_సంఖ్య=5
>>>రాణి_దగ్గర_ఉన్న_యాపిళ్ల_సంఖ్య=4
>>>యాపిళ్ల_సంఖ్య = రాజా_దగ్గర_ఉన్న_యాపిళ్ల_సంఖ్య+రాణి_దగ్గర_ఉన్న_యాపిళ్ల_సంఖ్య
>>>print(యాపిళ్ల_సంఖ్య)
చూశారా, ఎంత సులభమో. కాగితంపైన రాసినట్టుగానే ఉంటుంది. తేడా ఏంటంటే పైథాన్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. “రాణి దగ్గర ఉన్న యాపిళ్ల సంఖ్య” అన్నది “రాణి_దగ్గర_ఉన్న_యాపిళ్ల_సంఖ్య” గా మారింది. ఇక్కడ మీరు రెండు తేడాలు గమనించాలి. కాగితంపైన మనం తెలుగులో రాశాము. కానీ ప్రాంప్ట్‌లో స్పేస్‌లకు బదులు అండర్ స్కోర్ (_)లు ఉపయోగించాము. పైథాన్ లాంగ్వేజ్ సింటాక్స్ ఇంగ్లీష్‌లోనే/తెలుగులొనే రాయాలి, అందులోనూ స్పేస్‌లు ఉండకూడదు. ఇవి పైథాన్ రూల్స్. “రాజాదగ్గరఉన్నయాపిళ్లసంఖ్య” అని కూడా వ్రాయవచ్చు. మొత్తానికి స్పేస్‌లు ఉండకుండా చూసుకోవాలి. రాజా_దగ్గర_ఉన్న_యాపిళ్ల_సంఖ్య అన్నది పైథాన్‌లో ఒక వేరియబుల్.
మీరు పైన ఏం చేశారు. రాజా దగ్గర ఉన్న యాపిళ్ల సంఖ్యను రాజా_దగ్గర_ఉన్న_యాపిళ్ల_సంఖ్య వేరియబుల్‌లో స్టోర్ చేయాల్సిందిగా, అలాగే రాణి దగ్గర ఉన్న యాపిళ్ల సంఖ్యను రాణి_దగ్గర_ఉన్న_యాపిళ్ల_సంఖ్య అనే వేరియబుల్‌లో స్టోర్ చేయాల్సిందిగా మీరు కంప్యూటర్‌కి చెప్పారు. ఆ తర్వాత ఆ రెండు వేరియుబల్లను కూడాల్సిందిగా చెప్పారు. చివరగా, సమాధానాన్ని ప్రింట్ చేయాల్సిందిగా కంప్యూటర్‌కి చెప్పారు.
అంతే.
కంప్యూటర్‌కి దానికి అర్థమయ్యే భాషలో ఒకసారికి ఒక స్టెప్ చెబుతూ వెళ్లండి, అది పనిని పూర్తి చేసి, ఫలితాన్ని ఇస్తుంది.
Number_of_apples_raja_has=5 అని కంప్యూటర్‌కి చెప్పడం, దాని సహాయంతో గణిత సమస్యలను సాధించడం ఎలాగో మీరు నేర్చుకున్నారు. ఇక్కడ, Number_of_apples_raja_has=5 అనేది అసైన్‌మెంట్. మీరు 5 అనే విలువను Number_of_apples_raja_has అనే వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నారు. ఈ అసైన్‌మెంట్‌ని పైథాన్ లాంగ్వేజ్‌లో ఒక వాక్యంగా మనం భావించవచ్చు.
పై సమస్యను కొంచెం మారుద్దాం.
సమస్య: రాజా దగ్గర 5 యాపిళ్లు ఉన్నాయి. రాణి దగ్గర 4 యాపిళ్లు ఉన్నాయి. ఎవరి దగ్గర ఎక్కువ యాపిళ్లు ఉన్నాయి? దీన్ని సాధించడానికి మీరు పైథాన్ ప్రోగ్రామ్ రాయగలరా?
మీరు ప్రోగ్రామ్‌ని కింది అసైన్‌మెంట్‌లతో ప్రారంభిస్తారు:
>>>Number_of_apples_raja_has=5
>>>Number_of_apples_rani_has=4
ఆ తర్వాత ఏం చేస్తారు? మీకు ఒక భాషలోని కొన్ని పదాలు తెలియకపోతే, ఆలోచనను ఎలా పంచుకోలేరో, కంప్యూటర్‌కి కండీషన్‌ని ఎలా చెక్ చేయాలో చెప్పడం తెలియకపోతే, ప్రోగ్రామ్ రాయలేరు. మీరు ఇలా చెప్పడం కుదరదు:
>>> Number_of_apples_rani_has కంటే Number_of_apples_raja_has ఎక్కువ ఉంటే రాజా విజేత. లేదంటే రాణి విజేత.
మీరు పై విధంగా కంప్యూటర్‌కి చెప్పలేరు. ఎందుకంటే దానికి తెలుగు రాదు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి, పైథాన్‌లో అదే వాక్యాన్ని ఎలా రాయవచ్చో చూద్దాం. పైథాన్‌లో అలాంటి వాక్యాలను “if else” స్టేట్‌మెంట్‌లతో రాయవచ్చు.
అలాంటి స్టేట్‌మెంట్‌లను రాయడానికి మీరు కొన్ని రూల్స్‌ని అనుసరించాలి. పైథాన్‌లో కండీషన్ వాక్యం ఈ క్రింది విధంగా రాయవచ్చు:
if condition:
statements
else:
statements
వాక్యన్ని ఇలా రూపొందించవచ్చు. ‘if’తో ప్రారంభించి, కండీషన్ రాసి, కండీషన్ ముగిసినట్టుగా కంప్యూటర్‌కి చెప్పడానికి ‘:’తో దాన్ని ముగించాలి. తర్వాత ‘enter’ కీని నొక్కండి. తర్వాతి స్టెప్ పైథాన్ లాంగ్వేజ్‌లో చాలా ముఖ్యమైనది. తర్వాతి లైన్‌కి మీరు “ఇండెంట్” ఇవ్వాలి. అంటే ‘space’ కీని నాలుగు సార్లు నొక్కండి లేదా ‘tab’ కీని ఒకసారి నొక్కండి. అప్పుడు మీరు ఇంతకుముందు నేర్చుకున్న అసైన్‌మెంట్ స్టేట్‌మెంట్‌లను రాయవచ్చు. మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని రాయవచ్చు.
‘if’ పూర్తయిన తర్వాత, మీరు ‘else’కి కొనసాగవచ్చు. else కండీషన్ అవసరం లేకపోతే, మీరు ఇక్కడితో ఆపేయవచ్చు. else వాక్యం చాలా ఈజీగా ఉంటుంది. ‘else’ (ఇండెంటేషన్ ఉండేలా చూసుకోండి), ‘:’ టైప్ చేయండి, ఆ తర్వాత ‘enter’ నొక్కి, ‘tab’ నొక్కి, మీ స్టేట్‌మెంట్‌లను టైప్ చేయండి.
ఇప్పుడు పైథాన్‌లో మనం ఉపయోగించగలిగే కండీషన్‌ల గురించి తెలుసుకుందాం. అవి ఏవంటే:
Equals (సమానం): a == b. (తెలుగులో మనం a అన్నది bకి సమానం అని రాస్తాం. కానీ పైథాన్‌లో a == b అని రాయాలి) Not Equals (సమానం కాదు): a != b Less than (దాని కంటే చిన్నది): a < b Less than or equal to (దానికంటే చిన్నది లేదా దానికి సమానం): a <= b More than (దానికంటే పెద్దది): a > b More than or equal to (దానికంటే పెద్దది లేదా దానికి సమానం): a >= b
కొంచెం కష్టంగా ఉంది కదా? ఫర్వాలేదు. ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే అనిపిస్తుంది.
ఈ జ్ఞానంతో ‘Number_of_apples_rani_has కంటే Number_of_apples_raja_has పెద్దది అయితే, అప్పుడు రాజా విజేత. లేదంటే రాణి విజేత.’ అనే వాక్యాన్ని పైథాన్‌లో ఎలా రాయవచ్చో చూద్దాం.
Number_of_apples_raja_has=5
Number_of_apples_rani_has=4
if Number_of_apples_raja_has > Number_of_apples_rani_has:
print("Raja is the winner")
else:
print("Rani is the winner")
చూశారా, ఒక తెలుగు వాక్యాన్ని పైథాన్‌లో మనం ఎలా రాశామో.
అంతే. అందుకే పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా సులభమైనది.
ఇలా మీరు ప్రోగ్రామ్లన్నీ రాయాలి. మీ భాషలో సమస్యను (ఇంగ్లీష్/తెలుగు) అర్థం చేసుకోండి. మీ భాషలో పరిష్కారాన్ని ఆలోచించి, వాక్యాలను పైథాన్ లాంగ్వేజ్‌లోకి మార్చండి. కంప్యూటర్‌కి ఫీడ్ చేసి, ఆ సమస్యను కంప్యూటర్ ద్వారానే పరిష్కరించండి.
దీన్ని మరొక చిన్న ఉదాహరణతో ప్రయత్నిద్దాం.
సమస్య: ఒక సంఖ్య తీసుకోండి. అది సరి సంఖ్యా లేక బేసి సంఖ్యా అన్నది కనుగొనండి.
తెలుగులో పరిష్కారం: సంఖ్యను ‘num’ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయండి. ఆ సంఖ్యను 2 చేత భాగించినప్పుడు శేషం సున్నా వస్తే అది సరి సంఖ్య. లేదంటే బేసి సంఖ్య. కాబట్టి మనం సంఖ్యను తీసుకొని, దాని శేషాన్ని గణించి, ఆ శేషంపై కండీషన్‌ని వర్తింపజేయాలి.
పైథాన్‌లో పరిష్కారం:
num=5
remainder=num%5
if remainder==0:
print("Even number")
else:
print("Odd number")
శేషం విలువను మనం ‘remainder’ అనే ఒక కొత్త వేరియబుల్‌లో స్టోర్ చేసి, దాన్ని కండీషన్లో ఉపయోగించాము.
కండీషన్స్‌ని ముగించే ముందు, చివరిగా మరికొన్ని అంశాలను చూద్దాం.
ఒకసారి మళ్లీ రాజా, రాణి, యాపిళ్ల సమస్యకు వెళ్దాం. ‘‘రాణి కలిగిన యాపిళ్ల సంఖ్య కంటే రాజా కలిగిన యాపిళ్ల సంఖ్య పెద్దది అయితే, రాజా విజేత. లేదంటే రాణి విజేత’’ అనే వాక్యాన్ని పైథాన్‌లో ఎలా రాయాలో మనం చూశాము. దీనికి మరొక కండీషన్‌ని జోడిస్తే ఎలా ఉంటుంది. ‘‘రాణి కలిగిన యాపిళ్ల సంఖ్య కంటే రాజా కలిగిన యాపిళ్ల సంఖ్య పెద్దది అయితే, రాజా విజేత. లేదంటే రాణి విజేత. ఇద్దరూ సమానంగా యాపిళ్లు కలిగి ఉంటే, అప్పుడు అది టై’’.
అప్పుడు పైథాన్‌లో ప్రోగ్రామ్ ఇలా రాయాలి
if Number_of_apples_raja_has > Number_of_apples_rani_has:
print("Raja is the winner")
if Number_of_apples_rani_has > Number_of_apples_raja_has:
print("Rani is the winner")
if Number_of_apples_rani_has == Number_of_apples_raja_has:
print("It's a tie")
పైథాన్‌లో ఒక చక్కని భాషా నిర్మాణానికి ఉపయోగపడే అంశం ఒకటుంది. అది ‘elif’.
‘else’ మాదిరిగానే, ‘elif’ కూడా ఐచ్ఛికం. మీరు ‘elif’లు ఎన్ని అయినా ఉపయోగించవచ్చు. పైథాన్ elif కండీషన్లన్నింటినీ పరిశీలించి, అందులో మొదటి వాస్తవమైనదాన్ని (True) తీసుకొని, ఆ స్టేట్‌మెంట్‌లను ఎగ్జిక్యూట్ చేస్తుంది.
elif సింటాక్స్ (భాషా నియమాలు) ఇలా ఉంటుంది:
if condition1:
statement(s)
elif condition2:
statement(s)
elif condition3:
condition(s)
else:
statement(s)
ఇప్పుడు మనకు పైథాన్ లాంగ్వేజ్లో పదాలు తెలిసాయి కాబట్టి, పై సమస్యను పరిష్కరించడానికి వాటిని ఉపయోగిద్దాం. మనం ‘’రాణి కలిగిన యాపిళ్ల సంఖ్య కంటే రాజా కలిగిన యాపిళ్ల సంఖ్య పెద్దది అయితే, రాజా విజేత. లేదంటే రాణి విజేత. ఇద్దరూ సమానంగా యాపిళ్లు కలిగి ఉంటే, అప్పుడు అది టై’’ అనే వాక్యాన్ని పైథాన్‌లో ఇలా రాస్తాము:
if Number_of_apples_raja_has > Number_of_apples_rani_has:
print("Raja is the winner")
elif Number_of_apples_rani_has > Number_of_apples_raja_has:
print("Rani is the winner")
else:
print("It's a tie")
ఇతర భాషల మాదిరిగానే, మీరు ఒకే అర్థం వచ్చేలా అనేక రకాలుగా వాక్యాలను రాయవచ్చు. ఉదాహరణకు, పై సమస్యకు పరిష్కారాన్ని ‘<’ (దాని కంటే చిన్నది) ఉపయోగించి కూడా రాయవచ్చు. దాన్ని కూడా ప్రయత్నించి చూద్దాం. కొనసాగే ముందు మీరు మరికొన్ని అభ్యాసాలు చేయాలి:
num=55
if(num%5==0):
print("Divisble by 5")
if(num%55==0):
print("Divisble by 11")
పై ప్రోగ్రామ్ అవుట్ పుట్ ఇలా ఇస్తుంది:
Divisible by 5
Divisible by 11
కానీ మనం ఇలా ప్రింట్ అవ్వాలనుకున్నాం:
Divisible by 5 and 11
ఈ విధమైన ఫలితాన్ని ఎలా రాబట్టగలం. రెండు కండీషన్లను కలపడానికి మనం లాజికల్ ఆపరేటర్లను ఉపయోగిస్తాము. పైథాన్‌లో అత్యంత సాధారణ లాజికల్ ఆపరేటర్లు ‘and’ మరియు ‘or’. మనం ‘and’ మాత్రమే ఉపయోగిస్తే, రెండు కండీషన్‌లు వాస్తవమైనప్పుడే కండీషన్ మొత్తం వాస్తవం (True) అవుతుంది. మీరు ‘or’ ఉపయోగించినప్పుడు, రెండు కండీషన్లలో ఒక్కటి వాస్తవమైనా, కండీషన్ మొత్తం వాస్తవం అవుతుంది. కనుక లాజికల్ ‘and’ ఆపరేటర్ ఉపయోగించి మనం పై సమస్యకు పరిష్కారం ఇలా రాయవచ్చు:
num=55
if(num%5 == 0 and num%11 == 0):
print('Divisible by 5 and 11')
else:
print('Not Divisible by 5 and 11')
బాగుంది. ఇప్పుడు అన్ని అంశాలను ఒకే సమస్యలో కలిపి ప్రయత్నించండి. మీరు చేయగలరా, లేదా చూద్దాం.
సమస్య: వివిధ సబ్జెక్ట్‌ల మార్కులను స్టోర్ చేయండి. వాటి మొత్తాన్ని కనుగొనండి. మొత్తం 80కి సమానం లేదా అంతకంటే ఎక్కువ అయితే, ‘ఏ’ గ్రేడ్ ఇవ్వండి. మొత్తం 60 నుండి 80 మధ్యలో ఉంటే, ‘బి’ గ్రేడ్ ఇవ్వండి. లేదా మొత్తం 40 నుండి 60 అయితే, ‘సి’ గ్రేడ్ ఇవ్వండి. ఇక మొత్తం 40 కంటే తక్కువ అయితే ‘ఎఫ్’ గ్రేడ్ ఇవ్వండి.
మళ్లీ మొదటి సమస్యకు వెళ్దాం. మనం ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలతో పైథాన్ ద్వారా దాన్ని పరిష్కరించగలమా?
సమస్య: నేను మీకు 5 కార్డ్‌లు ఇచ్చాననుకోండి. ప్రతి కార్డ్‌పై ఒక సంఖ్య ఉంది. అవి 5,1,3,8,4 అనుకుందాం. 5 కార్డ్‌లలో అతిపెద్ద సంఖ్య ఏది.
సమస్యను ఇలా పరిష్కరించవచ్చు:
number1=5
number2=1
number3=3
number4=8
number5=4
largest=number1
if number2 > largest:
largest=number2
if number3 > largest:
largest=number3
if number4 > largest:
largest=number4
if number5 > largest:
largest=number5
print(largest)
బాగుంది. ఇలా సాధించవచ్చు. కానీ సమస్య ఏమిటంటే, 100 సంఖ్యలలో అతిపెద్ద దాన్ని ఎలా కనుగొనగలం. ఆ సంఖ్యలు 1000 ఉన్నప్పుడు.. 10,000 ఉన్నప్పుడు. దీనికి మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ రాయాలి, అలా టైప్ చేస్తూ పోవడానికి ఎంత సమయం పడుతుంది. ఈ సమస్యను ఇలా పరిష్కరించకూడదు. అంశాలను ఒక సమూహంగా స్టోర్ చేయడానికి, అంశాలను పునరావృతం చేయడానికి అవసరమైన పదజాలాన్ని మనం సమకూర్చుకోలేకపోతున్నాం. మీరు గుర్తుకు తెచ్చుకుంటే, తెలుగు భాషలో సమస్య పరిష్కారం ఇలా ఉంటుంది:
మొదటి కార్డ్ తీసుకోండి.
తర్వాతి కార్డ్ తీసుకోండి.
కొత్త కార్డ్ పెద్దది అయితే, దాన్ని చేతిలో ఉంచుకొని, పాతదాన్ని వదిలిపెట్టండి. అంటే, పెద్ద సంఖ్య కలిగిన కార్డ్ పట్టుకొని, చిన్న సంఖ్య కలిగిన దాన్ని వదిలిపెట్టండి.
ఇలా కార్డ్‌లన్ని పూర్తయ్యే వరకూ 2 మరియు 3 దశలను రిపీట్ చేయండి.
మీ చేతిలో ఉన్న కార్డ్ అతి పెద్దది.
4వ దశ ముఖ్యమైనది. ఫలానా పని.. ఫలానా వరకు చేయి అని ఎలా చెప్పామో చూడండి. ఇదే విషయాన్ని పైథాన్‌లో ఎలా చెప్పవచ్చో చూద్దాం.
మొదట, అంశాలను ఎలా సమూహపరచవచ్చో చూద్దాం. పైథాన్ మనకు లిస్ట్‌లను అందిస్తుంది. వేర్వేరు సంఖ్యలను number1, number2, number3 వంటి వేర్వేరు వేరియబుల్‌లలో స్టోర్ చేయడానికి బదులుగా, అన్ని సంఖ్యలను మనం ఒకే లిస్ట్‌లో స్టోర్ చేయవచ్చు. మనం [] ఉపయోగించి లిస్ట్‌ని నిర్వచించవచ్చు (డిఫైన్ చేయవచ్చు).
numbers=[5,1,3,8,4]
అంతే. ఒక్కో సంఖ్యకు ఒక్కో వేరియబుల్‌ని డిఫైన్ చేయడం కంటే ఇది ఎంతో సులభం. కానీ మనం వేర్వేరు సంఖ్యలను ఎలా యాక్సెస్ చేయగలం? చాలా ఈజీ, మీరు వాటిని numbers[0], numbers[1], numbers[2], numbers[3], numbers[4]గా యాక్సెస్ చేయవచ్చు.
మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించారా? మొదటి సంఖ్యను మనం numbers[0]గా యాక్సెస్ చేయబడింది, అలాగే రెండవ సంఖ్య numbers[1]గా యాక్సెస్ చేయబడింది, అలాగే మిగతావి అదే పద్ధతిలో యాక్సెస్ చేయబడ్డాయి. అంటే లిస్ట్ మూలకం లెక్కింపు 0 నుండి ప్రారంభమవుతుంది. మనమెప్పుడూ లెక్కింపు 1 నుండే ప్రారంభిస్తామని నాకు తెలుసు. కానీ ప్రోగ్రామింగ్‌లో కొన్ని కారణాల వల్ల, లిస్ట్ మూలకాల లెక్కింపు 0 నుండి ప్రారంభం అవుతుంది. మీకు లిస్ట్‌లో 100వ మూలకం కావాలంటే, numbers[99]గా (లిస్ట్ పేరు numbers అయితే) దాన్ని యాక్సెస్ చేయవచ్చు.
రెండవ విషయం ఏమిటంటే, కొన్ని నిర్దిష్ట స్టేట్‌మెంట్‌లను మనం మళ్లీ మళ్లీ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు పదజాలం కావాలి. దాని కోసం పైథాన్‌లో మనకు ‘for’ స్టేట్‌మెంట్ ఉంది.
‘for’ స్టేట్‌మెంట్ సింటాక్స్ ఇలా ఉంటుంది:
for variable in list:
statements
పై సింటాక్స్‌లో ‘variable’ అంటే వేరియబుల్ పేరు, అది ‘లిస్ట్’ నుండి ఒకసారికి ఒక విలువను తీసుకుంటుంది. ‘లిస్ట్’ మూలకాలు ఎన్ని ఉంటే ‘స్టేట్‌మెంట్‌లు’ అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి, లిస్ట్‌లో 5 మూలకాలు ఉంటే, స్టేట్‌మెంట్‌లు 5 సార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడొక చిన్న ఉదాహరణను చూద్దాం.
avengers=["iron man","spiderman","hulk","captain america","thor"]
for x in avengers:
print(x)
పై ప్రోగ్రామ్ ఒక్కో ఎవెంజెర్ పేరు ఒక్కోసారి ప్రింట్ చేస్తుంది.
ఇక్కడితో మనం రెండు కొత్త అంశాలు నేర్చుకున్నాం.
ఇప్పుడు అతిపెద్ద సంఖ్య సమస్యను మనం ఎలా పరిష్కరించవచ్చో మనం చూద్దాం.
“సూడో కోడ్” ఇలా ఉంటుంది: లిస్ట్‌లో సంఖ్యలను స్టోర్ చేయి
మొదటి మూలకాన్ని అదిపెద్దదిగా భావించి ప్రారంభించు
లిస్ట్‌లో ఒక సంఖ్య కోసం (for)
సంఖ్య అతిపెద్దదైనదాని కంటే పెద్దది అయితే
ఆ సంఖ్యను అతిపెద్దదానికి కేటాయించు (అసైన్)
అతిపెద్దదాన్ని ప్రింట్ చేయి.
ఇప్పుడు సరైన సింటాక్స్తో పైథాన్ కోడ్ రాద్దాం.
numbers=[5,1,3,8,4]
largest=numbers[0]
for number in numbers:
if number > largest:
largest=number
print(largest)
పైథాన్ ప్రోగ్రామ్ మనం రోజూ ఉపయోగించే భాషకు ఎంత దగ్గరగా ఉందో గమనించారా. అయితే మీరు ఇండెంటేషన్ మరియు సింటాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు కొంచెం పునశ్చరణ చేద్దాం. పైథాన్ లాంగ్వేజ్లో మనం ఈ కింది విషయాలను నేర్చుకున్నాం:
అసైన్‌మెంట్
కండీషనల్స్
లూప్స్
ఈ కన్‌స్ట్రక్ట్‌లతో మీరు దాదాపుగా ఎలాంటి ప్రోగ్రామ్‌ని అయినా రాయవచ్చు. ప్రోగ్రామింగ్ చాలా సులభంగా ఉంటుంది. ఈ మూడు స్టేట్‌మెంట్‌లను ఉపయోగించి మీరు కంప్యూటర్‌కి ఏ పని అయినా చెప్పవచ్చు.
ఈ సమస్యను మీరు సొంతంగా పరిష్కరించగలరా లేదా చూద్దాం.
సమస్య: లిస్ట్‌లో 10 సంఖ్యలను ఉంచండి. మరొక వేరియబుల్‌లో మీరు వెతకాల్సిన సంఖ్యను ఉంచండి. లిస్ట్‌లో రెండవ సంఖ్యను వెతకండి. సంఖ్య కనుగొనబడితే, కనుగొనబడింది అని ప్రింట్ చేయండి. లేదా కనుగొనబడలేదు అని ప్రింట్ చేయండి.
మీ తల్లిదండ్రులు, స్నేహితులతో చర్చించండి. మీకు కావాల్సినంత సమయం తీసుకోండి. ఒక్కో దశను పరిష్కరిస్తూ కొనసాగండి. కంప్యూటర్ సైన్స్‌లో ఇది అత్యంత సాధారణ సమస్య. దీన్ని మీరు పరిష్కరిస్తే, అది గొప్ప విషయమే. ఇది పూర్తయిన తర్వాత వేరే అధ్యాయానికి వెళ్దాం.
Note: Thanks to https://www.keypoint-tech.com/ for the translations.